మనువడిని పరామర్శించిన కేసీఆర్

0
206

రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య (11)ను ఆస్పత్రిలో పరామర్శించారు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆర్యను బుధవారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో చేర్చారు.

విషయం తెలిసిన కేసీఆర్ ఆసుపత్రికి వచ్చి మనవడిని పలకరించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పావుగంటపాటు మనవడితో గడిపిన కేసీఆర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. ప్రస్తుతం ఆర్య ఆరోగ్యం కుదుటపడిందని ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.