కేసీఆర్ టార్గెట్ 16 ఎంపీ స్థానాలు కాద‌ట‌.. టీఆర్ఎస్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ఇదే..!

0
132

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసినా రాజ‌కీయం మాత్రం ఇంకా పొగ‌లు, సెగ‌లు క‌క్కుతూనే ఉంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఇంకా మిగిలి ఉండ‌ట‌మేన‌ని, ఆ క్ర‌మంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర‌హాలోనే ఘ‌న విజ‌యం సాధించాల‌ని టీఆర్ఎస్‌, పోయిన పురువును నిబెట్టుకోవాల‌ని కాంగ్రెస్ ఇలా ఈ రెండు పార్టీలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో ప‌క్క ఒక్క స్థానంలోనైనా గెలిచి నేను సైతం అని అనాల‌ని బీజేపీ వ్యూహ ర‌చ‌న చేస్తోంద‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. అదే టీఆర్ఎస్ టార్గెట్ ఏంటి..? అన్న ప్ర‌శ్న తెలంగాణ పొలిటిక‌ల్ స్క్రీన్‌పై హాట్ డిస్క‌ర్ష‌న్‌గా మారిపోయింది. అయితే సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా 16 ఎంపీ స్థాన‌ల్లో గెలిచి తీరాలని టీఆర్ఎస్‌ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేసిన సంగ‌తి త‌లెఇసిందే. ఏ మాత్రం ఏమ‌ర‌పాటుగా ఉండ‌టానికి వీల్లేద‌ని ఆదేశించారు. కానీ, నిజానికి టీఆర్ఎస్ అస‌లు టార్గెట్ మాత్రం 16 ఎంపీ స్థానాలు కాదని, అస‌లు ల‌క్ష్యం ఏపీ ఎన్నిక‌లేన‌ని, టీడీపీని ఓడించ‌డం మీదే టీఆర్ఎస్ అధిష్టానం ఫోక‌స్ పెట్టింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం.

గ‌త ఏడాది చివ‌ర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రం సాగుతున్న వేళ ఏపీ రాజ‌కీయాల్లో వేలుపెడ‌తామ‌న్న హెచ్చ‌రిక‌ల ఎపిసోడ్ సాగిన విష‌యం పాఠ‌కుల‌కు విధిత‌మే. ఆ త‌రువాత స్వ‌యంగా కేసీఆర్ కూడా ఏపీ రాజ‌కీయాల్లో వేలుపెడ‌తామ‌న్న డైలాగ్‌ను రివీల్ చేశారు. కేసీఆర్ అన్న మాట ప్ర‌కారం ఇటీవ‌ల కాలంలో ఏపీ ఎన్నిక‌ల మీదే త‌న పూర్తి ఫోక‌స్ పోట్టార‌ని టీఆర్ఎస్ అగ్ర‌శ్రేణి నాయ‌క‌త్వం చెబుతోంది.

నిజానికి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 16 ఎంపీ స్థానాల‌ను గెలుచుకుని తీరాల‌ని టీఆర్ఎస్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఆ బాధ్య‌త‌ను ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్ప‌చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ అధిష్టానం ఏపీ పాలిటిక్స్ మీద ఫోక‌స్‌ను షిప్ట్ చేసేలా ఆదేశించార‌ట‌. ఏపీ ఎన్నిక‌ల కోణంలోనే కేసీఆర్ ఎత్తుల‌ను, వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.