రైతుల భూమి పట్టాల విషయంలో KCR బరోసా : ఒక్క రూ.1 లంచం ఇవ్వొద్దు

0
367
రైతుల భూముల పట్టాల విషయంలో KCR బారోసా : ఒక్క రూ.1 లంచం ఇవ్వొద్దు
రైతుల భూముల పట్టాల విషయంలో KCR బారోసా : ఒక్క రూ.1 లంచం ఇవ్వొద్దు

పెద్దపల్లి జిల్లా, గోదావరి ఖని భారీ భయిరంగా సభ సాక్షిగా ముఖ్యమంత్రి KCR రైతులకు శుభవార్త చెప్పాడు. భూప్రక్షాళన పేరుతో ఇప్పటికే 70 శాతం రైతుల భూముల పట్టాలను “ఆన్ లైన్” చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనివల్ల పట్టా పాసు పుస్తకాలకు సెక్యూరిటీ ఉండడమే కాక.. భవిష్యత్ లో రెవెన్యూ ఆఫీసర్ ల చుట్టూ తిరిగి లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఈ పథకాన్ని కొందరు అవకాశవాదులు తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఇలా చేస్తే రేపటినుండి మాకు లంచాలు దొరకవేమో.. అసలు ఉద్యోగాలే ఉండవేమో అనే భయంతో పనులు కాకుండా అడ్డు పడుతున్నారు.

అలా ఇంకా పాసు పుస్తకాలు రాని రైతులకు KCR శుభవార్త చెప్పారు. ఇంకా పట్టాలు కానీ రైతులు అస్సలు బాదపడకండి.. జూన్, జులై మాసం వరకు ఆగండి.. అప్పటిలోపు ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకోస్తున్నాం.. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయ్ అని హామీ ఇచ్చాడు. అలా అని రెవెన్యూ ఆఫీసర్స్ కి ఎలాంటి అన్యాయం చేయమని.. నిజాయితీగా పనిచేస్తే ప్రభుత్వం సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి కూడా హామీ ఇచ్చారు CM కే‌సి‌ఆర్.