మ‌హారాష్ట్ర‌లో సీఎం కేసీఆర్‌..!

0
108

తెలంగాణ ప్ర‌జ‌ల తాగు, సాగునీటి క‌ష్టాల‌ను తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభానికి సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ప్రాజెక్టు ప్రారంభ కార్య‌క్ర‌మానికి పొరుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను సీఎం కేసీఆర్ ఒక్కొక్క‌ర్ని క‌లుస్తూ ఆహ్వానిస్తున్నారు.

సీఎం కేసీఆర్ తాజాగా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావుతో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన కీల‌క అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించ‌డంతోపాటు ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. మ‌రికొద్ది సేప‌ట్లో సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్‌తోను భేటీ కానున్నారు. ఆయ‌న్ను ప్రాజెక్టు ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించే అవ‌కాశాలు ఉన్నాయి.