కే‌సి‌ఆర్ లోక్ సభ ఎన్నికల సర్వే ఫలితాలివే..

0
200

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 23వ తేదీన రాబోతోన్నవేళ టి‌ఆర్‌ఎస్ పార్టీ అధినేత కే‌సి‌ఆర్ తన మనసులోని మాట పంచుకున్నారు. దక్షిణాదిలో బీజేపీకి పది సీట్లు కూడా రవంటూ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు సమానంగా పంచుకుంటాయన్నారు.

బీజేపీకి 120-130 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 110-120 సీట్లు వస్తాయని, మిగిలిన సీట్లను ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటాయని కే‌సి‌ఆర్ జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కలిపి కమలనాథులు 9-10 సీట్లకు మించి గెలిచే అవకాశాలు లేవన్నారు. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదన్నఆయన..

గురువారం వెలువడబోయే ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే జరగబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ 16 సీట్లు, తమ మిత్రపక్షం ఒక స్థానాన్ని గెలుచుకోవడం ఖాయమన్నారు. కేసీఆర్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది చూడాలి.