కేసీఆర్ కుమార్తె కవితకు బిగ్ షాక్

0
61

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ నిజామాబాద్ ఎంపీ క‌విత ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె ఓట‌మిపాల‌వ‌డం టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లానికి కార‌ణ‌మైంది. నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు.

68వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ కవితపై పసుపు రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తమ నిరసనను తెలియజేస్తూ రికార్డు సంఖ్య‌లో నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.