కేసీఆర్‌, జ‌గ‌న్, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ సంతాపం

0
97

నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల సంతాప‌సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వివిధ పార్టీల నేత‌లు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని జ‌గ‌న్‌ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా విజయనిర్మల మృతిపై తమ సంతాపాన్ని ప్రకటించారు.