హైదరాబాద్‌ హాస్పటల్ ల్లో ప్రముఖ నిర్మాత జయశ్రీ కన్నుమూత

0
209

కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నా ప్రముఖ నిర్మాత జయశ్రీ గారు (60) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆమె హైదరాబాద్‌ లోని అపోలో హాస్పటల్ ల్లో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. జయశ్రీ గారు కన్నడ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

అమృత వర్షిణి, నమ్మోరా మదర హూవే, శ్రీ మంజునాథ, భవానీ, సైలెంట్‌ లాంటి ఎన్నో సినిమాలని నిర్మించారు జయశ్రీ. మరీ ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన “ముకుంద మురారి” చిత్రానికి ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించారు జయశ్రీ గారు. అలాగే మన తెలుగు పరిశ్రమలో ఆమెకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. జయశ్రీ మృతి పట్ల కన్నడ చిత్రా పరిశ్రమలకు చెందిన ప్రముఖులే కాక తమిళ్, తెలుగు చిత్ర ప్రముఖులు కూడా ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.