ఒక్కరోజులోనే .. పది కోట్లు..! కాంచన 3

0
191
tamilanadu kanchana3

హార్రర్ థ్రిల్లర్ సినిమాలతో దర్శకుడిగానూ, హీరోగా అభిమానులను ఆకట్టుకోవడంలో, భయపెట్టడంలో రాఘవ లారెన్స్ ని మించిన వారెవరు లేరు. అప్పట్లో రాఘవ లారెన్స్ రూపుదిద్దిన ముని, కాంచన, కాంచన 2 సినిమాలు తెలుగు, తమిళంలోనూ భారీ విజయాన్నీ, వసూళ్లను రాబట్టి హిట్ కొట్టాయి. ఈ నేపథ్యం లోనే ‘కాంచన3’ ని టాలీవుడ్ , కోలీవుడ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే సారి ఈ శుక్రవారం విడుదల చేశారు. లారెన్స్ సరసన బిగ్బాస్ ఫేమ్ ఓవియా, వేదిక నటించారు.

తమిళనాడు లో విడుదలైన ఈ సినిమా ఒక్కరోజులోనే రూ.10 కోట్లను గ్రాస్ ను సాధించి సెన్సషనల్ హిట్ కొట్టింది. కోలీవుడ్ లో ఇప్పటి వరకు ఓపెనింగ్ లోనే రూ. 10 కోట్లను క్రాస్ హీరో లిస్ట్ లను పరిశీలిస్తే.. సూపర్ స్టార్ రజిని కాంత్ , విజయ్, అజిత్, ప్రభాస్ , రాఘవ లారెన్స్ , శివ కార్తికేయన్ ఉన్నారు. బాక్సఫిక్ వద్ద ఒక్క రోజులోనే  రూ .10.75 కోట్లను సంపాదించి పెట్టింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా భారీ గా విడుదలైన సినిమా ముందు ముందు నిర్మాతలకు ఎన్ని కోట్ల వర్షం కురిపించనుందో.