‘కల్కి’ టీజర్ రేపే…10:10:10 సెకన్స్ కి ఖరారు..!

0
180
rajashekar acting in kalki

రాజశేఖర్ అంటే మదిలో మెదిలే పాత్ర పోలీస్. అలాంటి పాత్రలో చాలా రోజుల తరువాత తిరిగి తెర మీద కనిపించబోతున్నారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా ఆయనకు బాగా అచ్చొచ్చింది. ‘గరుడ వేగ’ మంచి హిట్ సాధించిన తరువాత… మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రశాంత్ వర్మ సినిమాకి ఓకే చెప్పారు. రాజశేఖర్ ని కలిసి ప్రశాంత్ వర్మ కథ చెప్పగానే అందులో పోలీస్ ఆఫీసర్ గా తన పాత్ర అని తెలియగానే బాగా నచ్చేసిందన్నారట.

kalki teaser on 10hr:10min:10sec

సినిమా లో రాజశేఖర్ కు జోడిగా ఆదా శర్మనటిస్తుంది. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా టైటిల్ ‘కల్కి ‘ ఖరారు చేశారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల చేసి , రేపు 10వ తేదీన ఉదయం 10:10:10సెకండ్ల కు టీజర్ ను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. దశావతారల్లో ఒక్కటైనా ‘కల్కి’ అవతారం పదవ అవతారం కాబట్టి ఈ సమయాన్ని నిర్ణయించుకున్నారట.