ప్రారంభ‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు..!

0
178

మ‌హా అద్భుత క‌ట్టం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభ‌మైంది. తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స‌మ‌క్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఏపీ, మ‌హారాష్ట్ర‌ల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, ఫ‌డ్న‌వీస్‌లు హాజ‌ర‌య్యారు. కాగా ఉద‌యం 8 గంట‌ల నుంచే కేసీఆర్ దంప‌తులు మేడిగ‌డ్డ బ్యారేజ్ ద‌గ్గ‌ర మ‌హాజ‌ల సంక‌ల్ప హోమాన్ని నిర్వ‌హించారు.

శృంగేరిపీఠం అర్చ‌కులు చేసిన మ‌హాజ‌ల సంక‌ల్ప హోమంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, జ‌గ‌న్‌, ఫ‌డ్న‌వీస్ పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంత‌రం వ‌చ్చిన అతిథుల‌కు సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు డిజైన్ గురించి వివ‌రించారు. అనంత‌రం ముహూర్తం స‌మ‌యానికి ముగ్గురు ముఖ్య‌మంత్రులు ప్రాజెక్టును ప్రారంభించారు.