‘భారతీయుడు 2’ అసలైన నిజమిదే..! కాజల్

0
202
kajal aggarval bharathiyudu2

తేజ డైరెక్షన్ లో కాజల్ అగర్వాల్ ‘సీత’ చిత్రం చేసింది. విబిన్నమైన కథాసారాంశంతో సాగుతున్న మూవీ ని ఈ నెల 24 వ తేదిన విడుదల చేయుటకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్స్ వేగం పెంచేశారు. చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కాజల్ ‘సీత’ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుతుంది. ఈ పరంగా తాను చేయబోతున్నతదుపరి మూవీలను తెలిపింది.

కాజల్ మాట్లాడుతూ .. ” తెలుగులో శర్వానంద్ తో ఒక చిత్రాన్ని.. తమిళములో జయం రవి తో ఒక చిత్రాన్ని పూర్తి చేశాను. అతి త్వరలనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ‘భారతీయుడు 2’ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వస్తున్న ప్రచారం అబద్దం. కేవలం రాజకీయాలలో కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. ఆ కారణంగానే చిత్ర షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. వచ్చే నెల నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఎపుడెపుడు మొదలవుతుందాని.. నాకు ఆసక్తి కరంగానే ఉంది. ‘సీత’ సినిమా లాంటి  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మరిన్ని చేయాలని ఉంది ” అని చెప్పింది.