మైమరపిస్తున్న… ‘డియర్ కామ్రేడ్’ సెకండ్ లిరికల్ సాంగ్ ..!

0
338
dear comrade second lyrical song

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. విజయ్ దేవరకొండ, రష్మిక జోడిగా నటిస్తున్న చిత్రంను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో విడుదల కానున్న చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇది వరకే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర బృందం .

ఈ పాటలో “కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే .. ఒడి చేరి ఒకటైపోయే.. తీరం కోరే ప్రాయం..” సాగే రొమాంటిక్ పాటను సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్ ఆలపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా రెహ్మాన్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలా… వినసొంపుగా మెలోడీ పాటలో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతే అందంగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న సినిమా విజయ్ దేవరకొండ కు, రష్మిక కు మరో మంచి హిట్ ఇచ్చేట్లు కనిపిస్తుంది.