‘అర్జున్ రెడ్డి’ ని దించేసిన ‘కబీర్ సింగ్’ ట్రైలర్..!

0
109
kabir singh official trailer

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెలుగు ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి ‘. ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’ పేరు తో రీమేక్ చేస్తున్నారు. దేవరకొండ రోల్ ని షాహిద్ కపూర్ చేయగా, షాలినీ పాండే పాత్రలో కైరా అద్వాని నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేశారు.

ట్రైలర్ లో లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలను కట్ చేస్తూ చూపించారు. ముఖ్యంగా హీరో తనకు ఎదురైనా ఆయా పరిస్థితుల సందర్భాల్లో ఇచ్చిన ఎమోషన్ సీన్స్ ను ట్రైలర్ లో కట్ చేస్తూ చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సన్నివేశాలపై కట్ చేసిన విధానం బట్టి , హిందీ వెర్షన్ లో అంతగా పెద్ద మార్పులు ఏమి కనిపించలేదు. ఈ చిత్రాన్ని జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ కొల్లగొట్టిన చిత్రం.. హిందీలో ఎలాంటి రిసల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.