హెలికాఫ్టర్‌ కి ఓటు వేస్తే, ఫ్యాన్‌ కి పడ్డాయ్ : జగనే ముఖ్యమంత్రి అవుతాడు – KA పాల్

0
834
హెలికాఫ్టర్‌ కి ఓటు వేస్తే, ఫ్యాన్‌ కి పడ్డాయ్ : జగనే ముఖ్యమంత్రి అవుతాడు – KA పాల్
హెలికాఫ్టర్‌ కి ఓటు వేస్తే, ఫ్యాన్‌ కి పడ్డాయ్ : జగనే ముఖ్యమంత్రి అవుతాడు – KA పాల్

KA పాల్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవ్వరికీ తెలియదు.. అలాంటి అయిన ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విదంగా ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి YS జగన్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి పోలింగ్ కి ముందు ప్రజాశాంతి పార్టీ గుర్తు అచ్చం మాలాగే ఉందని.. చదువుకోలేని సామాన్య ప్రజలు పొరపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజాశాంతి పార్టీ ఎలికాప్టర్ సింబల్ ని మార్చండి.. లేదా ఆ పార్టీని ఎన్నికల నుండి తొలగించండి YCP నేత విజయసాయిరెడ్డి ఎన్నిక సంఘాన్ని అనేకసార్లు కోరాడు.

అది తెలిసిన KA పాల్ YCP నేతల మీద ఫైర్ అయ్యాడు. ఫ్యాన్ కు, ఎలికాప్టర్ కు తేడా లేదా ? ఏం మాట్లాడుతున్నారు. మా సింబల్ నే క్యాన్సల్ చేయమంటారా ? అంటూ చెడా మడా తిట్టేశాడు. అలాంటి పాల్ ఇప్పుడు మా ఎలికాప్టర్ గుర్తు అనుకోని చాలామంది YCP కి ఓట్లు వేశారు అని చెప్పడం హాస్యాస్పదం అయ్యింది. పైగా మాకు 60 శాతం ఓట్లు పడ్డాయి.. ఆ ఓట్లు కాస్త జగన్ ఫ్యాన్ కె పడిపోయాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి జగనే CM అవుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు KA పాల్.