ఫారెన్ భామ సరసంలో జూ.ఎన్టీఆర్..!

0
402
Junior Ntr
Junior Ntr in RRR movie

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం RRR ఇప్పటికే ఈ సినిమా రెండవ షెడ్యూల్ కూడా రామ్ చరణ్ తో ఓ ఫైట్ సీన్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో కథనాయికల విషయంలో క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ సరసన అలియాభట్ , ఎన్టీఆర్ సరసన ఒక ఫారెన్ అమ్మాయి నటించనున్నారట. ఇప్పటికే అలియాభట్ తో డిస్కర్షన్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిందట. దర్శకుడు రాజమౌళి ఏది చేసిన డిఫరెంట్ గా నే ఉంటుంది. కమర్షియల్ సినిమాలో ను ఆయన కొంత వైవిద్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. మగధీర, ఈగ, మర్యాదరామన్న, బాహుబలి, ఇలా ప్రతి సినిమాను డిఫరెంట్ గా తీస్తాడు. ఇప్పుడు మరొక చిత్రం RRR తీస్తున్నాడు. ఈ సినిమా రాజమౌళి కెరీర్ లో మొదటి మల్టీస్టార్ మూవీ ఇద్దరు పెద్ద హీరోలతో తీస్తున్న ఈ సినిమాలోనూ కొత్తదనం చూపుతున్నారు.

రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్ ల విషయంలో వైవిద్యం చూపుతున్నారు. ఒక హీరోయిన్ బాలీవుడ్ భామ, మరో హీరోయిన్ గా ఫారెన్ నటి నటిస్తున్నారు. బాలీవుడ్ భామ అలియాభట్ ని రాజమోళిని ఇప్పటికే ఒప్పించాడట. బాలీవుడ్ లో తన అందంతో అభినయంతో మెస్మరేజ్ చేస్తున్న అలియాభట్ రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో నటించనుంది. అయితే అలియాభట్ మాత్రం అఫీషియల్ గా ఈ సినిమా కోసం సైన్ చేయలేదు. ఈ సినిమాకి ఆమె చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దానికి తగ్గట్టుగా తన పారితోషకం కూడా భారీగా ఉండాలని కోరుతుందటా. మొత్తానికి పారితోషకం, డేట్స్ విషయంలో క్లారిటీ వస్తే ఆమె వెంటనే సైన్ చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సైన్ చేయటానికి ఆమె దాదాపు అంగీకరించినట్లేనట. మరో వైపు ఎన్టీఆర్ సరసన ఓ ఫారెన్ భామ నటించనుంది. లండన్ కు చెందిన ఒక మోడల్ ని సైన్ చేశారని సమాచారం. అయితే ఆ అమ్మడు పేరు మాత్రం అలియాభట్ సైన్ చేసిన తర్వాత ప్రకటిస్తారట. ఎన్టీఆర్ సరసన ఫారెన్ భామ నటించడం మెదటి సారి. ఈ సినిమా కథ అంతా బ్రిటీష్ కాలంలో జరుగుతుంది. RRR సినిమాను రాజమౌళి 300కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.