అభిమాని మరణం పై మనస్తాపానికి గురవుతూ.. లేఖ..! యంగ్ టైగర్

0
233
junior ntr big fan jayadev passes away

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జయదేవ్ ఇక లేరు అనే వార్త వినగానే భావోద్వేగానికి గురవుతూ ఫేస్బుక్ లో తన భాదను వ్యక్తచేశారు. కృష్ణ జిల్లా వాసి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘము ప్రతినిధి జయదేవ్ మరణం తో మనస్థాపానికి గురై, తన భాధను వ్యక్తపరుస్తూ ఒక లేఖ ను పెట్టారు. తారక్ అభిమానులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ అందరిని కంట తడి పెట్టించింది.

ఎన్టీఆర్ ఫేస్బుక్ లో పెట్టిన లేఖలో.. “నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. “నిన్ను చూడాలని” చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడి గా నేను చూసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రఘాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను.” అని తన సంతాపాన్ని తెలియ చేస్తూ అతనితో దిగిన ఫొటో ను పోస్ట్ చేశారు.