‘యంగ్ టైగర్’ బర్త్ డే స్పెషల్ ..!

0
207
junior ntr birthday special

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ లో తనకంటూ ఇమేజ్ సంపాదించుకుని .. అభిమానుల గుండెల్లో యంగ్ టైగర్ గా ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు ఈరోజు. తాత సీనియర్ ఎన్టీఆర్ రూపం మాత్రమే కాకుండా, నటన , అభినయం తొణికి పుచ్చుకున్నాడు. మరోవైపు బాబాయి బాలకృష్ణ డైలాగ్స్ ను అదరగొట్టేసేలా తొడగొట్టి చూపించాడు.

చిన్నతనం లోనే ‘బాలరామాయణం’ తో ప్రేక్షకులకు పరిచయమై నటనకు నీరాజనము పట్టించుకున్నాడు. ఆ తరువాత ‘నిన్నుచూడాలని’ రొమాంటిక్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, అల్లరి రాముడు, నాగ, సింహాద్రి, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ, యమదొంగ, కంత్రి, శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్ షా, అదుర్స్, రభస, టెంపర్, రామయ్య వస్తావయ్యా, బృందావనం, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత లాంటి సినిమాలలో నటించి యాక్షన్, ఎమోషన్, లవ్ అన్నికలబోసి నట్లుగా తనకిచ్చిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ నటించగలడు అనేట్టుగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ లో యంగ్ టైగర్ కొమురం బీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించుటకు సిద్దమవుతున్నాడు.

యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్, నటీనటులు కాజల్ అగర్వాల్, కొణిదెల ఉపాసన రామ్ చరణ్, దివ్యాంశ కౌశిక్, హరీష్ శంకర్, ఈషా రెబ్బ, దర్శకుడు బాబీ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తదితర సినీ ప్రముఖులు శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియ చేశారు. మరో వైపు హీరో మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో మంచు ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.