‘ఎన్టీఆర్’ సీఎం కావాలి.. నందమూరి ఇంటి ముందు పోటెత్తిన ఫ్యాన్స్..!

0
192
cm junior ntr slogans

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా.. నిన్న ఆయన ఫ్యాన్స్ అంతా ఇంటి ముందు ఏకమయ్యారు. ఫ్యాన్స్ ముందరకు వచ్చిన యంగ్ టైగర్ కు షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. ఆ సమయాన అభిమానులు అందరు ఒకే సారి నినాదం చేశారు. ‘సీఎం ఎన్టీఆర్.. కాబోయే ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్..!’ అంటూ వచ్చిన నినాదం విన్న యంగ్ టైగర్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసి.. మీ అందరి అభిమానానికి థాంక్స్ అని చెప్పి విదేయథను చాటుకుని అక్కడునుంచి వెళ్ళిపోయాడు.

జూనియర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల‌ కు దూరంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ తన రక్తం లోనే రాజకీయం పుణికి పుచ్చుకుంది. వద్దనుకుని పాలిటిక్స్కు ఎంత దూరంగా ఉన్న.. ఎన్టీఆర్ మనసును లాగేలా ఎదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది.

ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని బహిరంగానే తేలియచేశారు. 2009 ఎన్నికల సమయాన టీడీపీ కి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన విషయము అందరికి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో తాత ఎన్టీఆర్‌ మాదిరిగానే ఖాకీ డ్రెస్ ధరించి ప్రచారం చేయడం మరో విశేషం. అప్పుడే ఎన్టీఆర్ వారసుడొచ్చాడు అనుకునేలా కనిపించాడు. ఆ మధ్య లక్ష్మి పార్వతి కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షత వహిస్తే తాను తప్పకుండా పార్టీ లో కలుస్తానని చెప్పింది.

తాజాగా అభిమానులు కూడా రాజకీయం వైపు రావాలంటూ వారి కోరికను బయట పెట్టారు. సీఎం..సీఎం అంటూ గొంతెత్తి అరచి అబిమానానన్ని చాటి చెప్పారు. ప్రస్తుతం సీఎం ఎన్టీఆర్ అని అరవడం ఒక సంచలనముగా మారింది. ఇక ఎన్టీఆర్ దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడో.. భ‌విష్య‌త్తులో యంగ్ టైగర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తాడేమో చూడాలి.