ఇక బీజేపీకి హోల్ అండ్ సోల్ న‌డ్డానే.!

0
135

దేశ‌వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొత్త జ‌వ‌స‌త్వాలిచ్చి రెండుసార్లు కేంద్రంలో అత్య‌ధిక మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి తేవ‌డంలో అమిత్ షా చాణ‌క్య నీతి వెల‌క‌ట్ట‌లేనిది. మోదీ-షా కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అనిపించుకుంది. అయితే, ఇకమీద‌ట‌ షా రోల్ ని బీజేపీలో జేపీ న‌డ్డా నిర్వ‌హించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం కేంద్ర ఆరోగ్య‌ మంత్రిగా ప‌నిచేస్తోన్న‌జేపీ న‌డ్డాను బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బీజేపీ చీఫ్ అమిత్‌ షా కేంద్ర కేబినెల్‌లో చేరేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది.

బ్రాహ్మణ సామాజిక‌వర్గానికి చెందిన 59 ఏళ్ల నడ్డా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా ఉన్నారు. పార్టీలో ఆయన ఎక్కువ ప్రచారంలో లేకపోయినప్పటికీ… మంచి వ్యూహకర్తగా న‌డ్డాకు పేరుంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్న ఆయ‌న యూపీలోని మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీని 62 చోట్ల విజయం తీరాల‌కు చేర్చ‌గ‌లిగారు.