ప్రజా వేదిక‌ను కూల్చిన జ‌గ‌న్‌కు భ‌విష్య‌త్‌లో జ‌ర‌గ‌బోయేది ఇదే..!

0
268

ఉండ‌వ‌ల్లిని ఆనుకుని ఉన్న కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్మించిన ప్ర‌జా వేదిక అక్ర‌మ క‌ట్ట‌డ‌మ‌ని, ఆ భ‌వ‌నాన్ని త‌క్ష‌ణ‌మే కూల్చేయాలంటూ సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించిన నాటి నుంచి ఏపీ రాజ‌కీయం మ‌రింత వేడెక్కిన సంగ‌తి తెలిసిందే.

త‌మ ప్ర‌భుత్వం రాజ్యాంగ నిబంధ‌న‌ల‌ను అనుగుణంగా పాల‌న‌ను కొన‌సాగిస్తుంద‌ని, ఆ క్ర‌మంలోనే ఎక్క‌డ అక్ర‌మ కట్ట‌డాలు ఉన్నా వాటిని కూల్చేసేలా సీఎం జ‌గ‌న్ జీవోను జారీ చేశార‌ని మంత్రులు చెబుతుండ‌గా, మ‌రోప‌క్క రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే చంద్ర‌బాబు నిర్మించిన ఆ భ‌వ‌నాన్ని కూల్చేశారంటూ ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా వేదిక‌ను కూల్చిన జ‌గ‌న్‌కు భ‌విష్య‌త్‌లో ఎదురు కానున్న ప‌రిణామాలు ఇవేనంటూ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ విశ్వ‌నాథ్ చెప్పుకొచ్చారు.