జోగిని శ్యామ‌ల : నాకూ ఆ ఆఫ‌ర్ వ‌చ్చింది.. కానీ..!

0
286

బిగ్‌బాస్ – 3 ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అవ‌కాశం క‌ల్పిస్తే మా బాస్‌ను ఎలా సంతృప్తి ప‌రుస్తావంటూ ఫేస్ టు ఫేస్ అడుగుతున్నారంటూ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డితోపాటు ఇటీవ‌ల మీడియా ముందు బ‌హిర్గ‌తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, అదేమాదిరి బిగ్‌బాస్ సీజ‌న్ -3పై కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేస్తూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉండ‌గా, బిగ్‌బాస్ సీజ‌న్ -3పై వ‌చ్చిన కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌ల‌పై జోగిని శ్యామ‌ల స్పందించారు. త‌న‌కు తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభం నుంచి వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని, కానీ ఆ ఆఫ‌ర్ల‌ను తాను తిర‌స్క‌రించిన‌ట్టు చెప్పారు. మొద‌ట త‌న‌కు అవ‌కాశం వ‌చ్చిన స‌మ‌యంలో అమీతుమీ సినిమాలో న‌టిస్తున్నాన‌న్నారు.

అలా అని తాను బిగ్‌బాస్ షో న‌చ్చ‌ద‌ని కాద‌ని, ఆ హిందీ బిగ్‌బాస్‌కు తాను పెద్ద ఫ్యాన్ అంటూ శ్యామ‌ల మీడియాతో చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ల‌క ముందు ఎంత పెద్ద పొజీష‌న్‌లో ఉన్నా.. తిరిగొచ్చే స‌మ‌యంలో చుర‌క అంటించుకురావాల్సి ఉంటుంది. అలా త‌న‌ప‌ట్ల ప్ర‌వ‌ర్తించేలా ఎవ్వ‌రికీ ఆ స్పేస్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా. అటువంటి ఫేమ్ త‌న‌కు వ‌ద్ద‌ని, అందుకే బిగ్‌బాస్ – 3 సీజ‌న్‌కు అవ‌కాశం వ‌చ్చినా వెళ్ల‌లేద‌ని జోగిని శ్యామల తెలిపింది.