‘జెర్సీ’ ట్రైలర్ రిలీజ్.. నాని ఏం చేశాడో మీరు చూడండి ..!

0
67
Jersy trailer

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్వహిస్తున్న సినిమాలో నాని హీరోగా నటించగా, నాని సరసన శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి, సాంగ్స్ కి ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగానున్నాడు.

ఈ ట్రైలర్ లో నాని యువ ఆటగాడు గా క్రికెట్ లో అదరగొడుతుంటాడు. అదే సమయంలో అతని ఆటకు ఆకర్శితురాలై  ఒక అమ్మాయి  ప్రేమలో పడుతుంది. కట్ చేసే సన్నివేశాలతో చూస్తే పదేళ్ల తరువాత ఒక కొడుకు , భార్యతో జీవనం కొనసాగిస్తూ సరైన ఉద్యోగం లేక జీవితంలో అవస్థలు పడుతుంటాడు . భార్య పర్సులోనే డబ్బుకోసం దొంగతనం చేయడం ..భార్య చీదరించుకోవడం.. సెంటిమెంట్ సీన్ లతో చూపించారు. పదేళ్ల పాటు క్రికెట్ కి దూరమై , తిరిగి జట్టులోకి ముప్పదిఆరేళ్ల వయస్సులో చేరుటకు ఎంతో శ్రమిస్తాడు. తన కొడుకు దృష్టిలో ఏ మాత్రం తగ్గకూడదనే నాని తపనను ట్రైలర్ లో మీరు చూడండి.