‘జెర్సీ’ మూవీ రివ్యూ..!

0
461
jersy movie review

నటీనటులు : నాని, శ్రద్ధాశ్రీనాథ్ , సత్యరాజ్, బ్రహ్మాజీ , సుబ్బరాజు, రాహుల్ రామ కృష్ణ , సంపత్ రాజ్, రోనిత్ కమ్ర

న్యాచురల్ స్టార్ నాని నటించిన సినిమా ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. క్రికెటర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైనది.  మరి టాక్ ఎలా ఉందో చూద్దాం రండి..

కథలోకి వెళ్తే .. అర్జున్ పాత్రలో నాని నటించాడు. సారా పాత్రలో శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. నాని యువ ఆటగాడు గా క్రికెట్ లో అదరగొడుతుంటాడు. తనకున్నలక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నపుడు.. అనుకోకుండా నాని జీవితంలోకి సారా ఎంట్రీ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ కి వస్తే..

సారా , అర్జున్ ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. వీరి మధ్య సాగిన ప్రేమ .. రొమాంటిక్ సన్నివేశాలతో యూత్ కి నచ్చేలా ఉంటుంది. మొత్తానికి కొన్ని కారణాల వలన ప్రేమ కాస్త వారిని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఇక అతని జీవితంలో ఎంతగానో ఇష్టపడ్డ క్రికెట్ ని… కొన్నిసంఘటనల వలన వదిలేసుకోవాల్సి వస్తుంది.

సెకండ్ హాఫ్ కి వస్తే…

సారాతో అర్జున్ పెళ్లి జీవితం మొదలవుతుంది. వీరిద్దరి జీవితంలో వారి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు నాని(రోనిత్ కమ్ర). అర్జున్ క్రికెట్ ని వదిలేసి ఎలాంటి జాబ్ చేయలేక ఉన్న పరిస్థితుల్లో కుటుంబ బాధ్యత మొత్తం సారా మోస్తుంటుంది. అర్జున్ కి నాని అంటే చాలా ఇష్టం.. నాని కి కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. కొడుకు దృష్టిలో తండ్రి ఒక హీరో. ఆ లెవెల్ లోనే ఉండటానికి అర్జున్ ఎంతగానో కష్టపడుతుంటారు. ఏ జాబ్ చేయలేని అతని చేతిలో ఎలాంటి డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతూ.. అందరితో అవమానాలు ఎదుర్కొంటుంటారు.. ఒకానొక సమయంలో భార్య దృష్టిలో కూడా చీప్ అవుతాడు.

అవమానాలు.. అడ్డంకులు.. కష్టాలు అన్ని పడుతున్న నానిలో క్రికెట్ వైపు వెళ్లాలనే ఆలోచన వస్తుంది. దాంతో తిరిగి క్రికెట్ జట్టులో జాయిన్ కావాలనుకుంటాడు. పది సంవత్సరాల పాటు వదిలేసిన క్రికెట్ లో తిరిగి జాయిన్ కావడానికి ఎన్నో కష్టాలు పడతాడు. ముప్పదిఆరు సంవత్సరాల వయసులో క్రికెట్ జట్టులో జాయిన్ అయ్యి.. అతని లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ గెలుపులో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు మరచి పోతాడు. ముఖ్యంగా నాని (కొడుకు) కళ్లలో ఆనందాన్ని చూసిన అర్జున్ ఆనందానికి అవధులు ఉండవు.. అంతేకాకుండా గెలుపుకు వయస్సు ఎప్పుడు అడ్డురాదని నిరూపిస్తాడు అర్జున్.

అర్జున్ క్రికెట్ కి ఎందుకు దూరం అవుతాడు..? క్రికెట్ కి దూరం అయ్యాక అర్జున్ పరిస్థితి ఏంటి? క్రికెట్ జట్టులో తిరిగి ఎందుకు జాయిన్ అవుతాడు? ప్రేమకు .. పెళ్ళికి దారి తీసిన పరిస్థితులేంటి? ప్రధాన పాత్రలో నటించిన సత్యరాజ్ కి అర్జున్ కి గల సంబంధం ఏంటి? అర్జున్ లవర్ గా, భర్తగా, తండ్రిగా ఎలా చేసాడు అనేది తెరపైనే చూడాలి.

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
మ్యూజిక్ : అనిరుద్ రవి చందర్
సినిమాటోగ్రఫీ : షాను వరగేసే

Review :4/5.