ఆకట్టుకుంటున్న’జెర్సీ’ లిరికల్ సాంగ్..!

0
80
jersy lyrical song released

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్వహిస్తున్న సినిమాలో నాని హీరోగా నటించగా, నాని సరసన శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి, సాంగ్స్ కి ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగానున్నాడు.

న్యాచురల్ స్టార్ నాని సినిమాలో క్రికెటర్ గా అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు. నాని క్రికెటర్ గా అతను అనుకున్న స్థాయి కి చేరుకోడానికి ఎంతగానో కష్టపడుతుంటాడు. ఈ పయనంలో ఎన్నోకష్టాలు, అవమానాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ముప్పది ఆరేళ్ళ వయస్సులో ఎన్నో కష్టాలతో చివరకు గెలుపు తలుపు తడుతుంది. ఈ విదంగా విజయానికి వయస్సు ఎప్పుడు అడ్డురాదని నిరూపిస్తాడు. ఆ వయస్సులో తనకు చేరువైన గెలుపు అన్నికష్టాలను మరచిపోయేలా చేస్తుంది. తన గెలుపుకు అడ్డువచ్చిన, ఎదుర్కొన్న ఎన్నో సమస్యలతో ఆసక్తికరమైన కథా కథనాలతో సాగే చిత్రము నుంచి కొద్దిసేపటి క్రితమే మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

‘ప్రపంచమే అలా.. నిద్దరలో ఉందిగా.. నువ్వేమో మేలుకుందిగా .. నా పెదాలపై ఇలా’ అని కొనసాగే పాట యూత్ ని ఆకట్టుకునేలా సాగింది. అనిరుద్ రవీందర్ మ్యూజిక్ అందించగా, కృష్ణ కాంత్ లిరిక్ అందించారు. షాషా తిరుపతి , ఇన్నో జంగా ఆలాపించిన పాట శ్రోతలను ఆకర్షిస్తుంది.