ఆ విష‌యంలో జ‌న‌సేన సూప‌ర్ స‌క్సెస్‌..!

0
124

గురువారంనాడు జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం కూడా కీల‌కంగా మారింద‌న్న‌ది టీడీపీ లెక్క‌. ముందు నుంచి అనుకున్న‌దానికంటే జ‌న‌సేన ఎక్కువ‌గానే ప‌ర్‌ఫామ్ చేసింద‌ని వారు అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఓటు వేసిన యువ ఓట‌ర్ల సంఖ్య చెప్పుకోద‌గ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. స‌హ‌జంగా యూత్ ఓట్లు టీడీపీతో పోల్చుకుంటే వైసీపీకే ఎక్కువ ఉంటాయ‌ని గుర్తు చేస్తున్నారు.

కానీ వైసీపీకి వెళ్లాల్సిన యూత్ ఓట్ల‌పే త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో గ్లాస్ గుర్తు స‌క్సెస్ అయింద‌ని అంచ‌నా వేస్తున్నారు. అది కూడా త‌మ‌కు క‌లిసొస్తుంద‌న్న‌ది టీడీపీ వాద‌న‌. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌కు సంబంధించి మ‌రో ఈక్వేష‌న్ తెర‌మీద‌కు తెస్తున్నారు. ప్ర‌కాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపు సామాజిక ఓట్ల‌ను జ‌న‌సేన చీల్చ‌డం టీడీపీకి అడ్వాన్టేజ్ అంటున్నారు.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపుల రిజ‌ర్వేష‌న్‌ల ద‌గ్గ‌ర నుంచి ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలకు సంబంధించి జ‌గ‌న్ చేసిన కామెంట్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల‌కు ఉన్న ఫీడ్ బ్యాక్. ఈ క్ర‌మంలో జ‌న‌సేన అభ్య‌ర్ధులు బ‌ల‌మైన వారు ఉంటే వారికే వేశార‌ని, అలాకాని ప‌క్షంలో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు నెక్ట్స్ ఆప్ష‌న్ టీడీపీగానే ఉందంటున్నారు. దీంతో గ‌తంతో పోల్చుకుంటే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో టీడీపీకి సీట్లు త‌క్కువ‌గా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నా వైసీపీకంటే ఆధిక్య‌త‌లోనే ఉంటామ‌ని అంటున్నారు.