ప‌సుపు – కుంకుమే టీడీపీని కాపాడుతుంది : ఎంపీ జేసీ

0
393

సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేసిన పసుపు – కుంకుమే తెలుగుదేశం పార్టీకి మ‌ళ్లీ అధికారాన్ని క‌ట్ట‌బెడుతుంద‌ని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసం ఎదుట మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆసక్తిక‌ర విష‌యాలు చెప్పారు.

ప‌సుపు – కుంకుమ ప‌థ‌కం నిధుల‌ను పంపిణీ చేసేందుకు కేవ‌లం త‌న ఒక్క నియోజ‌కవ‌ర్గంలోనే దాదాపు రూ.50 కోట్ల నిధులు ఖ‌ర్చైన‌ట్టు జేసీ తెలిపారు. న‌వ్యాంధ్ర నిర్మాణంలో అలుపెర‌గ‌కుండా క‌ష్ట‌ప‌డ్డ చంద్ర‌బాబు క‌ష్టాన్ని ఎవ‌రైనా గుర్తించారా..? అని జేసీ దివాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. నేటి రోజుల్లో ఓటు వేయ‌మ‌ని అడిగితే రూ.2వేలు ఇవ్వ‌మ‌ని అడుగుతున్నార‌ని, ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు స‌క్ర‌మంగా, ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌రిగేలా సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌న్నారు.