జేసీ దివాకర్ రెడ్డి జోస్యం : చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది

0
814
జేసీ దివాకర్ రెడ్డి జోస్యం : చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది
జేసీ దివాకర్ రెడ్డి జోస్యం : చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది

జేసీ దివాకర్ రెడ్డి మరోసారి చంద్రబాబును పొగడ్తలతో ముంచేశాడు. మహిళల విషయంలో చంద్రబాబు తీసుకొచ్చిన పథకాలను దృష్టిలో పెట్టుకొనే నిన్న ఓట్లు వేసేందుకు మహిళలు, వృద్ధులు ఆయనకు కృతఙ్ఞతలు తెలపడానికి విరగబడి వచ్చారని జేసీ అభిప్రాయపడ్డారు. ఈరోజు విలేకరులతో ముచ్చటించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అనంతపురం టౌన్, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం రాసి పెట్టుకోండి… మే 23వ తేదీన చూడండి చంద్రబాబుకు అదృష్టం సుడి తిరిగినట్టు తిరిగింది” అంటూ జోస్యం చెప్పారు జేసీ.

ఆయా పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించిన మధ్యాహ్నానికే పనిచేశాయి.. సహజంగా క్యూ లో నిలబడ్డ మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుమేరకు ఆయనకు కృతఙ్ఞతలు తెలపడానికి మళ్లీ వచ్చి ఓటేశారని జేసీ అన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో ఉందని.. అందుకే అర్ధరాత్రి దాకా ఓట్లు వేశారని, ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరపురాని సన్నివేశం అనీ అభివర్ణించారాయన.