జేసీ దివాక‌ర్‌రెడ్డికి మ‌రో స‌వాల్‌..!

0
318

అనంత‌పురం రాజ‌కీయాల్లో జేసీ దివాక‌ర్‌రెడ్డి మార్క్ ద‌శాబ్దాలుగా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అటువంటి జేసీకి ఇప్పుడు రాజ‌కీయంగా పెద్ద స‌వాల్ వ‌చ్చి ప‌డిందని, అనంత‌పురం ఎంపీగా బ‌రిలో నిలిచిన జేసీ ప‌వ‌న్ కుమార్‌రెడ్డిని జేసీ గెలిపించుకుంటారా..? అన్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీచేసిన జేసీ దివాక‌ర్‌రెడ్డి అవ‌లీల‌గా విజ‌యం సాధించారు. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్ధుల గెలుపులో కీల‌కంగా ప‌నిచేశారు. ఈ సారి మాత్రం తాను త‌ప్పుకుని, కుమారుడిని ఎంపీ అభ్యర్ధిగా బ‌రిలో నిలిపారు. మ‌రోప‌క్క వైసీపీ మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ బీసీ వ్య‌క్తిని ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీకి నిలిపింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు వార్ వ‌న‌సైడ్‌గా మారిందనుకున్న వారంతా ఒక్క‌సారిగా ట‌ఫ్ ఫైట్‌గా మారింద‌ని చెబుతున్నారు.