ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది నిజ‌మైన గెలుపు : జేపీ

0
281

మంచి ఉద్దేశంతో ప్ర‌జా జీవ‌నంలోకి వ‌చ్చిన‌ప్పుడు గెలుపోట‌ముల‌ను లెక్క‌పెట్ట‌కూడ‌ద‌ని లోక్‌స‌త్తా వ్యవ‌స్థాప‌కులు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ అన్నారు. అంతేకాకుండా కోట్ల‌రూపాయ‌లు ఖ‌ర్చుపెడితే వ‌చ్చిన ఓట్ల‌తో గెలుపు సాధించ‌డం అస‌లు గెలుపే కాద‌ని ఆయ‌న అన్నారు. కాగా, ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మిపై అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ పై విధంగా త‌న సమాధానాన్ని చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టేందుకు ప‌వ‌న్ వ‌ద్ద కావాల్సిన డ‌బ్బు లేద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో డ‌బ్బులు పెట్టి గెల‌వ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన‌ను స్థాపించి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చినప్పుడు.., ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ల్లో మ‌న‌లాంటి వారు రావాల‌ని, త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నం చేయాల‌ని చెప్పాన‌ని, కానీ విజ‌యాలు వ‌స్తాయ‌న్న ఆశ మాత్రం పెట్టుకో కూడ‌దంటూ ప‌వ‌న్‌కు సూచించిన‌ట్టు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ చెప్పుకొచ్చారు.