‘జయలలిత’ ఆత్మ నాతో చెప్పిన మాటలే .. ‘శశిలలిత’..!

0
273
sasilalitha movie
sasilalitha movie

దర్శకులు ఒకరిని మించి ఒకరు అన్నట్లు ప్రముఖుల జీవిత గాథలను తెరకెక్కిస్తున్నారు. ఆ పరంగా ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాలు క్రిష్ అందిస్తున్నాడని తెలుసుకున్న ప్రేక్షకులకు, ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ప్రజలల్లోకి ఓ న్యూస్ వదిలారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అని మరో సంచలనమైన న్యూస్ తెరమీదకు తీసుకవచ్చారు. ఇలా ఎన్టీఆర్ జీవితం మీద  పోటీ దర్శకత్వం నెలకొంది.

ఇదిలా ఉండగా మరో సినీ, రాజకీయ రంగాలలో వెలుగు వెలిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం తమిళ ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమిళ ప్రజలు జయలలితను ‘పురుచ్చి తలైవి’ గా పిలుచుకుంటారు. తమిళ దర్శకులలో ప్రముఖులైన ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తమిళంలో ‘తలైవి’, హిందీలో ‘జయ’ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటె మరోవైపు సంచలన దర్శకుడు జయలలిత నిచ్చెలి శశికళ జీవిత కథను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. మరోవైపు తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘శశిలలిత’ టైటిల్ తో జయలలిత, శశికళ ఇద్దరి జీవితాలను కలిపి తెరకెక్కించబోతున్నాడట.  ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్టులుక్ పోస్టర్ లో సగం జయలలిత, సగం శశికళ ముఖం తో ఆకట్టుకునేలా రూపొందించారు.

‘శశిలలిత’ టైటిల్ తో రాబోతున్న సినిమాలో జయలలిత అనారోగ్య పరంగా ఆస్పత్రిలో 75రోజుల పాటు పొందిన బాధను, అక్కడ చోటు చేసుకున్న సన్నివేశాలను ప్రధానాంశముగా చూపెట్టబోతున్నారు. జయలలిత బాల్యాన్ని, నటిగా ఎదిగిన వైనం, రాజకీయ రంగ ప్రవేశం  ప్రజల గుండెల్లో పెంపొందించుకున్న అభిమానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జయలలిత ఆత్మ తనతో చెప్పిన మాటలను సినిమాగా తెరక్కేక్కిస్తున్నారన్నట్లు మీడియాతో పంచుకున్నారు.