రైతులకు రూ. 5వేల పింఛన్. – ఎకరాకు రూ. 8వేల సాయం – రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ హామీల వర్షం

0
68
pavan kalyan
pavan kalyan

ఏపీలో ఎలెక్షన్ ల వేడి మొదలై చాలా రోజులైంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ఏపీ పర్యటనలు చేస్తూ ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలందరికి సభావేదిక పరంగా మెనూ ఫెస్టో విడుదల చేసి రైతులకు హామీల పంట పండించారు.

రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎంతో ఘనంగా జరిగింది. జన సేన బహిరంగ సభకు తరలొచ్చిన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ వేదిక పరంగా మాట్లాడి పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. పవన్ అధికారంలోకి వస్తే ముఖ్యంగా రైతులకు పథకాలను అమలు చేస్తామన్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగులకు లాగానే ఫించేన్ ఇస్తామని చెప్పారు. అరవై సంవత్సరాలు దాటినా చిన్నకారు, సన్నకారు రైతులందరికీ ఐదువేల రూపాయలు పించన్ ఇస్తామని చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి పరంగా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలను హెల్ప్ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కుల, మత భేదాభి ప్రాయాలు లేకుండా అన్ని వర్గాల రైతులకు మా మేనిఫెస్టోలో ఉన్నట్లు అన్ని నెరవేరుస్తామన్నారు.  అంతే కాకుండా ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ వ్యవసాయ మార్కెట్‌ ఉభయగోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..

విద్యార్థుల విషయానికొస్తే.. ఉచితంగా బస్‌పాసులు అందచేసి, ఇప్పటివరకు కులాల పరంగానున్న వసతిగృహాలను తీసివేసి, అందరికి సమీకృత వసతిగృహాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నోటిఫికెషన్స్ విడుదల చేసినపుడు ఒకేసారి ఫీజు చెల్లించే పద్దతి పట్టుకొస్తామన్నారు. అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణ గా పేరు తెచ్చుకున్న డొక్కా సీతమ్మ పేరు మీదుగా క్యాంటిన్లను ఏర్పాటు చేయనున్నట్లు సభాపరంగా చెప్పారు. చివరగా ప్రతి ఇంటికి పది లక్షల రూపాయల ఆరోగ్య భీమా అందచేయనున్నట్లు జనాల్లో హామీ వర్షం కురిపించారు .