ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : జ‌న‌సేన అభ్య‌ర్ధి అరెస్ట్‌..!

0
105

దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఓట‌ర్లు ఎంతో ఉత్సాహంతో త‌మ నాయ‌కుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల‌కు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి ద‌శ పోలింగ్ ప్రారంభ‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌తోపాటు, తెలంగాణ‌లో 17 లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే, అనంత‌పురం జ‌న‌సేన అభ్య‌ర్ధి మ‌ధుసూద‌న్ గుప్తాను కాసేప‌టి క్రితం పోలీసులు అరెస్టు చేశారు. మ‌ధుసూద‌న్ గుప్తాను అరెస్టు చేసిన పోలీసులు పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోలీసులు మీడియాతో మాట్లాడుత గుత్తిలోని 183 పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఈవీఎంల‌ను మధుసూద‌న్ గుప్తా ప‌గ‌ల‌గొట్టాడ‌ని, అధికారుల‌పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డాడ‌ని, దాంతో ఆయ‌న్ను అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ట్టు వారు తెలిపారు.