ప‌త్రిక పెడుతున్నాం.. ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటాం : ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

0
85

గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేసినప్పటికీ సమయాభావం వల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోవడం వల్లనే ఓటమి ఎదురైనట్టు జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్‌కల్యాణ్ చెప్పారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం గురువారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

ఇకనుంచి ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్ల‌డించారు. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి ప్రజల ఆదరణ సంపాదించాలని భావిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పక్షాన ఒక పత్రిక పెడుతామని కూడా ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా ప్రకటించారు. పత్రిక స్వరూప స్వభావాలు, శీర్షకలు, తదితర అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నారు.