జ‌న‌సేన దారుణ ఓట‌మికి కార‌ణం అదొక్క‌టేన‌ట‌..!

0
227

జ‌నసేన పార్టీని స్థాపించి రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల్లో మాత్రం స‌త్తా చాట‌లేక‌పోయారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీచేసిన రెండు స్థానాల్లోను ఓడిపోయారు. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణే స్వ‌యంగా ఓడిపోవ‌డంతో జ‌న‌సేన శ్రేణులు పూర్తిగా డీలాప‌డిపోయారు. జ‌న‌సేన నుంచి ఒక‌చోట గెలుపొందినా పార్టీ అధ్య‌క్షుడే రెండు చోట్లా ఓడిపోవ‌డంతో ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఇసుమంతైనా క‌నిపించ‌లేదు. ఇలా జ‌న‌సేన పోటీచేసిన ప్ర‌తీ చోటా కూడా దారుణ ఫ‌లితాల‌ను చ‌విచూడ‌టానికి గ‌ల కార‌ణం ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ స్వ‌యంకృతాప‌రాధాలే కార‌ణమ‌న్న భావ‌న రాజ‌కీయ విశ్లేష‌కుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.