సీఎం జ‌గ‌న్‌తో జ‌న‌సేన ఎమ్మెల్యే భేటీ..!

0
291

ఈ ద‌ఫా జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన టికెట్‌పై గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ కాసేప‌టి క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాగా వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తొలి అసెంబ్లీ స‌మావేశాలు ఈ రోజు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. శాస‌న స‌భ్యులుగా ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఈ క్ర‌మంలో తొలిరోజు అసెంబ్లీకి హాజ‌రైన వ‌ర ప్ర‌సాద్ శాస‌న సభ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం సీఎం ఛాంబ‌ర్‌లోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిశారు. సుమారు అర్ధ‌గంట‌పాటు వీరి మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగాయి. జ‌గ‌న్‌తో భేటీ ముగిసిన అనంత‌రం బ‌య‌ట‌కొచ్చిన వ‌ర ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడారు.

తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లిశాన‌ని ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన టికెట్‌పై గెలుపొందిన తాను వైసీపీలో చేర‌బోతున్నానంటూ ఇటీవ‌ల కొన్ని క‌థనాలు ప్ర‌చురిత‌మ‌య్యాయ‌ని, ఆ క‌థ‌నాల‌న్నీ అవాస్త‌వాల‌ని ఆయ‌న ఖండించారు. తాను జ‌న‌సేన‌లోనే కొన‌సాగుతాన‌ని వ‌ర‌ప్ర‌సాద్‌ వెల్ల‌డించారు.