టీడీపీని నిండాముంచిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్

0
482

2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ఇచ్చి 2019 తిరుగుబాటు జెండా ఎగురవేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వతంత్రంగానే బరిలో దిగాలని నిర్ణయించుకుని ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఫలితంగా అటు అధికార టీడీపీ కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇదే చంద్రబాబుకి తిరుగులేని పరాజయాన్ని ఇచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ.పీ.లోని ఓటింగ్ సరళిని పరిశీలించిన మీదట అర్థమవుతోంది ఇదేనంటున్నారు.

టీడీపీ, జనసేనకు పడిన ఓట్లుకలుపుకుంటే జగన్ పార్టీకి వచ్చిన ఓట్లు చాలా నియోజకవర్గాల్లో తక్కువగా రావడమే దీనికి నిదర్శనమంటున్నారు. ఎప్పుడైతే, గుంటూరు మీటింగ్ లో లోకేష్ మీద పవన్ తీవ్ర విమర్శలు చేశారో అప్పుడే జగన్ కు మార్గం సుగమమం అవుతూ వచ్చిందంటున్నారు.