పవ‌న్ క్లారిటీ : ముంచే అవ‌కాశాన్ని ఇత‌రుల‌కు ఇస్తాడా..? సీఎం సీటు క‌న్ఫాం..!

0
440

అంద‌రూ భావించిన‌ట్టే ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు కొన్నికొన్ని చ‌దురుమదురు సంఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల తీరునుచూసి త‌మ పార్టీకి ఎలా లేదన్నా 40 నుంచి 50 స్థానాలు త‌గ్గ‌కుండా గ్యారెంటీగా వ‌స్తాయ‌ని జ‌న‌సేన దిగువ‌స్థాయి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లెక్క‌లేస్తున్నారు.

మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల్లో హంగ్ ఏర్ప‌డుతుంద‌ని, ఆ సంద‌ర్భంలో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్ల‌ను నిర్ణ‌యించే స్థాయిలో తాముంటామ‌ని, అవ‌స‌ర‌మైతే ప్ర‌త్య‌ర్ధ పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని కార్య‌క‌ర్త‌లు వారి వారి అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

జ‌న‌సేన‌లోని పెద్ద‌స్థాయి వ‌ర్గం వారుమాత్రం త‌మ పార్టీకి 20 నుంచి 30 వ‌ర‌కు ఎమ్మెల్యే సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నాలు వేసుకుంటున్నారు.అదే సంద‌ర్భంలో జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ వంటి వారు వ‌చ్చేట‌ప్ప‌టికి జ‌న‌సేన‌కు 88 సీట్లు వ‌స్తాయ‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు. అందులో ఎంత‌మేర నిజ‌ముంద‌న్న విష‌యం ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత మాత్ర‌మే తెలియ‌నుంది.

మ‌రోప‌క్క, జ‌న‌సేన అధినేత మాత్రం తానొక మ‌ర్మ‌యోగిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని రాజ‌కీయ ఎన‌లిస్టులు భావిస్తున్నారు. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌ట‌య‌పెట్ట‌కుండా, తాను ఏమ‌నుకుంటాడో అదే చేసుకుంటూ పోతున్నాడు. త‌న పార్టీని త‌న స్వ‌హ‌స్తాల‌తో న‌డిపించుకుంటూ వెళుతున్నాడు.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన విష‌యంలో అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించి మ‌ర్మ‌యోగి అవ‌తార‌మెత్తాడేమోన‌న్న అభిప్రాయం ప‌లువురి నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. జ‌న‌సేన విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌విష్య‌త్తులోనూ ఇదే తీరును వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌.