మరో ట్రెండ్ సృష్టించిన జనసేనాని : మాయావతికి పాదాభివందనం

0
641
మరో ట్రెండ్ సృష్టించిన జనసేనాని : మాయావతికి పాదాభివందనం
మరో ట్రెండ్ సృష్టించిన జనసేనాని : మాయావతికి పాదాభివందనం

పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే.. పెద్దలకు గౌరవం ఇవ్వడంలో మాత్రం ఆయన మొదటి స్థానంలో ఉంటారు. కొందరు నామమాత్రంగా గౌరవం ఇస్తే పవన్ మాత్రం మనస్ఫూర్తిగా ఇస్తాడు. ఆయనలో ఉన్న ఆ గొప్పతనమే  అభిమానులకు ఆకర్షించింది. జనసేనాని పెద్దలకు ఎంత గౌరవం ఇస్తాడో గుర్తుచేసే మరో సంఘటన విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్ లో జరిగింది.

జనసేన, BSP పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.. అందులో బాగంగానే AP పర్యటనకు వచ్చిన “మాయావతి”కి స్వాగతం పలికిన జనసేనాని. ఆ సమయంలో ఎవ్వరూ ఊహించని విదంగా ఆమెకు పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. ఈ అరుదైన సన్నివేశానికి “విశాఖ ఎయిర్‌ పోర్ట్” వేదికయ్యింది. ఎన్నికల పొత్తులో భాగంగా BSP, జనసేన పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు మాయావతి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేశారు.

విశాఖ ఎయిర్‌ పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్ బయటికి వస్తున్న సమయంలో ఆమెను కలిసిన జనసేనాని.. గౌరవప్రదంగా ఆమెకు నమస్కరించి.. అనంతరం ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ అలా చేస్తాడని మాయావతి సైతం ఊహించలేదు. దాంతో ఆమె ఆనందానికి అవదులు లేవు.. ఆ ఆనందంలో పవన్ ను ఆశీర్వదించిన మాయావతి అక్కడి నుంచి బయలుదేరి హోటల్‌ కు వెళ్లిపోయారు.

బుధవారం విశాఖపట్టణం నుంచి మాయవతి, పవన్ కళ్యాణ్‌ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతకు ముందు జనసేనానితో కలిసి మీడియా సమావేశానికి హాజరవుతారు మాయావతి.. ఆ తరువాత విజయవాడ అజిత్‌ సింగ్ నగర్‌ లోని “మాకినేని బసవపున్నయ్య” స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గురు, శుక్రవారాలు వరుస బహిరంగ సభలకు హాజరవుతారు BSP అధినేత మాయావతి.