‘జనసేన.. అశ్వమేథ’ (స్పెష‌ల్ స్టోరీ)

0
180

ప్రాచీన కాలంలో రాజులు అశ్వమేథ యాగం చేసేవారు. యాగాశ్వాన్ని తన రాజ్యం పరిధిలో విడిచి పెట్టేవారు.ఆ అశ్వం ఎంతవరకూ వెళ్తే అంతవరకూ ఉన్న భూభాగం తన రాజ్యం పరిధిలోనిదేనని ప్రకటించుకునే వారు.అశ్వమేథ యాగం నిజమైన యుద్ధాన్ని నివారించి ప్రాదేశికంగా కొత్త ప్రాంతాలను గెల్చుకోవడానికి ఉపయోగపడేది.శ్రీరామచంద్ర మూర్తి అశ్వమేథ యాగం చేసి వదిలిన అశ్వాన్ని ఆయన కుమారులైన లవకుశులు పట్టుకుని బంధించినట్టు రామాయణగాథ తెలుపుతోంది.ఆంధ్రప్రదేశ్‌ లో సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత త్రేతాయుగం నాటి అశ్వమేథ యాగం మాదిరిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా విజయం సాధిస్తున్నారు.

పవన్‌ కల్యాణ అనంతపురం జిల్లాలో డిసెంబర్‌ 2వ తేదీన భారీ కవాతులోప్రసంగించారు.ఈ సభలో పవన్‌ కల్యాణ్‌,సిపిఐ,సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ శాఖల కార్యదర్శులు రామకృష్ణ, పి.మధులు ప్రసంగించారు.ఈ సభకు వచ్చిన జనం రాయలసీమలో జనసేనకు బలం లేదన్న తప్పుడుఅభిప్రాయం పటాపంచలు చేసింది.కవాతుకు వచ్చినవారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే,వీరిలో 95శాతం యువకులే. వామపక్ష నాయకులైన రామకృష్ణ, మధులుపరిణతి చెందిన రాజకీయ నాయకులు. అనంతపురం కవాతు జనసేన నాయకులు రాయలసీమలో మొదటి సారి ప్రజలతో ముచ్చటించిన సభ.రాయలసీమ ఫ్యాక్షన్ల వారీగా చీలిపోయిందనీ, మూడవ శక్తికి బలం లేదనే అభిప్రాయం చాలా కాలంగా నాటుకుని పోయింది.కవాతుకు వచ్చిన జనాన్ని చూస్తే ఈ ప్రాంతంలో కొత్త రాజకీయ శక్తి అవసరమని రుజువు అయింది.

పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో చాలా ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు.

ఎ) రాయలసీమ గడిచిన ఐదు దశాబ్దాలుగా కొన్ని కుటుంబాలు,కొంతమందినాయకుల గుప్పెట్లో ఉందనీ, గడిచిన ఏడుదశాబ్దాలుగా రాజకీయ యవనికపై కొత్త ముఖాలు కనిపించడం లేదనీ,ఎంపీలు, ఎమ్మెల్యే పదవుల్లో ఆనాటినుంచి అవే కుటుంబాల వారు వారి సంతానం కొనసాగుతున్నారని అన్నారు.

బి) రాయలసీమ యావత్తు కరవు కోరల్లో చిక్కుకుంది.దాంతో నిరుద్యోగసమస్య తాళవృక్ష స్థాయికి పెరిగింది. గడిచిన ఐదు దశాబ్దాల్లో కరవు నివారణకు వేలాది కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు.కానీ, ఆ నిధులతో ఎక్కడా అణు మాత్రం ఉపశమనం కనిపించలేదు.రాయలసీమకు చెందిన బలహీన వర్గాల వారు ఉపాధి కోసం గల్ఫ్‌ ప్రాంతాలకు వలస వెళ్ళారు. కర్నాటక,తమిళనాడు,కేరళలలో లక్షలాది మంది రాయలసీమ వాదులు వలసగా వచ్చి ఉపాధి పొందుతున్నారు.వలస కార్మికులంతా నైపుణ్యం లేనివారుకావడం వల్ల తక్కువ ఆదాయం పొందుతున్నారు.

సి) బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాయలసీమ హీరోల గురించి పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.కోస్తా ఆంధ్ర కన్నా రాయలసీమవాసులు ఎక్కువ పన్నులు చెల్లించారు.రాయలసీమలో కోస్తా ఆంధ్ర కన్నా ఎక్కువ గ్రంథాలయాలు ఉన్నాయి.దీనిని బట్టి రాయల సీమ వాసులు కోస్తా వారి కన్నా

ఎక్కువచదువుకున్నవారని స్పష్టం అవుతోంది.విద్యా పరంగా ముందున్నా, రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి రాజకీయాలే కారణమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

రాయలసీమ రాజకీయాలు: కోస్తా ఆంధ్ర,తెలంగాణల కన్నా,రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు కావడం గమనార్హం.ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలకు ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ దక్కలేదు. కాసు బ్రహ్మానంద రెడ్డి తప్ప కోస్తా వాసులకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కోస్తా ప్రాంతానికి చెందిన వారైనా , ఆయన హిందుపురం సీటునే అట్టిపెట్టుకున్నారు.రాయలసీమకే ప్రాతినిధ్యం వహించారు.నెల్లూరు కోస్తాలోని ఇతర జిల్లాల కన్నా, రాయలసీమకు దగ్గర.ఆ జిల్లాకు చెందిన బెజవాడ గోపాల రెడ్డి,నేదురుమల్లిజనార్దనరెడ్డి లు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి,దామోదరం సంజీవయ్య,కె విజయభాస్కరరెడ్డి,చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి,కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాయలసీమకు చెందిన వారే.వీరంతా 20 ఏళ్ళు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.స్వాతంత్య్రానంతరం రాయలసీమ 50 ఏళ్ళ పాటుముఖ్యమంత్రులను అందించింది.రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు 50 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన దృష్ట్యా,రాయలసీమ వెనకబడటంరాజకీయంగా ఎంత మాత్రం క్షమార్హంకాదు.రాయలసీమలో కొన్ని వర్గాలు బాగా లబ్ధి పొందాయి.అధిక సంఖ్యాకులు దారిద్య్రంలో మగ్గుతున్నారు.

అలాంటి వారంతా డిసెంబర్‌ 2వ తేదీన పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన కవాతుకు హాజరయ్యారు. వారంతా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలని కోరుతున్నారు. తమను ఫ్యూడల్‌ శక్తులనుంచి విముక్తి చేయమని పవన్‌ కల్యాణ్‌ కు మొరపెట్టుకున్నారు.ఇప్పటిదాకా రాయలసీమలో మూడవ ప్రత్యామ్నాయం లేదు, పవన్‌ క ల్యాణ్‌ లో వారుప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని చూశారు.గడిచిన కొద్ది సంవత్సరాలుగా రాయలసీమలో ముఠా కలహాలు, హింస ప్రబలాయి. ఆర్థిక పురోగతితో క్రమంగా హింస తగ్గుముఖం పట్టింది.

అయితే, రాజకీయ వర్గాల గుత్తాధిపత్యం వల్ల రాజకీయ పెత్తందారీతనం ఇంకా కొనసాగుతోంది. హింస స్థానంలో రాజకీయ పెత్తందారీ తనం వచ్చింది.రాజకీయాలను శాసించడమే దోపిడీకి ప్రధాన మార్గమని అగ్రవర్ణాలు గ్రహించాయి.రాజకీయాలు సంపదకూ, అధికారానికీ తలుపులు తెరిచాయి. రాజకీయాల్లో ఉంటే కాంట్రాక్టులు,గనుల లైసెన్సులు ,బదిలీలకు ముడుపులు, మద్యం సంపద,అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నడపడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని వారు గ్రహించారు.సంపదతోనూ, రాజకీయాల కారణంగానూ అవేకుటుంబాలు ఎమ్మెల్యే పదవులనూ, ఎంపీ పదవులనూ పొందుతున్నాయి.వెనకబడిన,షెడ్యూల్డ్‌ కులాల వారిని ఎదగనివ్వరు.రాయలసీమ రాజకీయాల్లో కొత్త వారు ఎన్నికల్లో నెగ్గడం చాలా కష్టం.
కొన్ని జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం వారూ, చిత్తూరు,అనంతపురంజిల్లాల్లో కమ్మవారు ప్రాబల్యంకలిగిఉన్నారు.జనాభాలో అధిక సంఖ్యాకులైన వెనకబడినతరగతులు,షెడ్యూల్డు కులాలు,తెగలు,

మైనారిటీ వర్గాలకు నాయకుడు ఒక్కరి పేరు చెప్పండి చూద్దాం.వారికి స్థానం లేదు. ఆర్థిక ప్రగతి కొందరికి మాత్రమే పరిమితం అయింది.అధిక సంఖ్యాకులు పేదరికంలోనే మగ్గుతున్నారు.రాయలసీమలో వివిధ కులాలు, సామాజిక వర్గాల మధ్య అంతరం చాలా ఉంది.

ప్రజల్లో విద్యా వ్యాప్తి వల్ల ప్రజాస్వామ్యం కోసం కోరస్‌ ఎక్కువగా కనిపిస్తోంది.పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన బరిలో ఉంటే ఇలాంటివర్గాలకు అవకాశాలులభిస్తాయి.

అనంతపురం కవాతుప్రభావం:
ఎ) జనసేన రాష్ట్ర వ్యాప్త పార్టీ అని రుజువు చేసుకుంది. పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్రమంతటా మద్దతుదారులు ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టకుండా జనసేన లక్షలాది మంది యువకులను సమీకరించగలదని అనంతరపురం కవాతు రుజువుచేసింది.ప్రజలు స్వచ్చందంగా వచ్చారు. రవాణాసౌకర్యాలను కోరలేదు.అలాగే,బిర్యానీ, రోజువారీ కూలీ డిమాండ్‌ చేయలేదు. రాజకీయ పార్టీలు తమ సభలకు వేలాది మంది జనాన్ని కిరాయికి తెస్తుంటాయి. అలా వచ్చిన వారిలో ఏమాత్రం ఉత్సాహం కనిపించదు.జనసేన కవాతుకు వచ్చిన వారంతా ఉత్సాహంతో కదం తొక్కారు.

బి) జనసేన సభలకు అన్ని వర్గాలూ, కులాల వారూ వస్తారని అనంతపురం కవాతు రుజువు చేసింది.పేదలు,మధ్యతరగతి వారు వచ్చారు.బెంగళూరు నుంచి అధిక సంఖ్యలో ఐటి నిపుణులు వచ్చారు.ఏ ఇతర పార్టీకీ ఇంతమంది జనం రాలేదు.వచ్చిన వారిలో అధిక సంఖ్యాకులు యువకులు,.అనంతపురం కవాతుకు మీడియా తగిన ప్రచార ం ,ప్రాధాన్యంఇవ్వకపోయినా, సామాజిక మాధ్యమాలు ఎక్కువ ప్రచారం ఇవ్వడం వల్ల లక్షలాది మంది తరలి వచ్చారు.తెలుగు మీడియా అసత్యపు వార్తలనూ ,పెయిడ్‌ న్యూస్‌కూ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ జాతీయ మీడియాలో మంచి ప్రాచుర్యంలభిస్తోంది.

సి) ఎంతో మంది ఎమ్మెల్యేలూ,ఎంపీలు, సీనియ ర్‌ రాజకీయ వేత్తలూ జనసేనలో చేరేందుకు క్యూ కడుతున్నారు.వారిలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు ధనవంతులు మాత్రమే కావాలి.ప్రజలు మచ్చలేని నాయకులను కోరుకుంటున్నారు కాం ట్రాక్టర్లను కాదు.

డి) దళిత ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు (గుంటూరు జిల్లా) కు అనంతపురం సభలో జనసేన శ్రేణులు ఆహ్వానం పలికాయి. విద్యావంతులైన దళిత ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల్లో అవమానాల పాలవుతున్నారు.దళిత ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబును రాజకీయంగా ఎందుకు బహిష్కరించారో, అగ్రవర్ణాలవారు అవమానిస్తుంటే ఎందుకు చూస్తూఊరుకున్నారో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సంజాయిషీ ఇవ్వాలి., కిషోర్‌ బాబును లెక్క చేయవద్దని అధికారులు,మంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి.అనంతపురం కవాతులో కిషోర్‌ బాబు ఉనికి తెలుగు రాష్ట్రాలలో స్పష్టమైనసంకేతాన్ని ఇచ్చింది.

కొత్త రాజకీయ పార్టీలుూ….ఐజాక్‌ న్యూటన్‌ సాపేక్ష సాంద్రత
ఐజాక్‌ న్యూటన్‌ (164-1727) ప్రపంచ విఖ్యాత శాస్త్రజ్ఞుడు.350 ఏళ్ళ క్రితమే ఆయన సాంద్రత సిద్ధాంతాన్ని కనుగొన్నారు. సాంద్రత అనేది ఓ శక్తి.అది నిన్న కింద పడేస్తుంది.ప్రతికొత్త రాజకీయ పార్టీ రాజకీయ సాంద్రతతో సతమతంఅవుతుంటుంది.అయితే,అనంతపురం,ధవళేశ్వరం కవాతులు న్యూటన్‌ సిద్ధాంతాన్ని ఛేదించింది.అది ఇప్పుడు కక్ష్యలో ఉంది.రాకెట్‌ భూసాంద్రతను వీడిన తర్వాత గంటలోవేలాది మైళ్ళు ప్రయాణిస్తుంది. అలాగే, జనసేన కూడా దూసుకుని పోతోంది.

దేశంలో మూడు మహానగరాలు రాయలసీమ చుట్టూ ఉన్నాయి.: నిరుపేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నగరాలకు తరలి పొమ్మన్నారు. దేశంలో మహానగరాలు ఢిల్లిd,ముంబాయి,కోల్‌ కతా, హైదరాబాద్‌, బెంగళూరు,చెన్నైలు ఉన్నాయి.రాయలసీమ చుట్టూ మూడుమహానగరాలు ఉన్నాయి.బెంగళూరునుంచి అనంతపురంకు మూడు గంటల ప్రయాణం. కర్నూలునుంచి హైదరాబాద్‌ కు రెండు గంటల ప్రయాణం.చెన్నైకి చిత్తూరు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నుంచి చెన్నైకి మూడు గంటల ప్రయాణం. రాయలసీమ మాదిరిగా దేశంలో ఏ ప్రాంతానికీ మహానగరాలు ఇంత చేరువలో లేవు.

రాయలసీమ చుట్టూ హైదరాబాద్‌,చెన్నై, బెంగళూరు ముక్కోణపు ఆకారంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికిఏమాత్రం మేలు జరగలేదు.దీనికి కారణం రాజకీయాలే. ఇందుకు పరిష్కారం జనసేన ప్రారంభించిన నవతరం రాజకీయాలు చూపే మార్గమే.ఈ ప్రాంతానికి చెందిన నాయకులు మహానగరాల్లో కూర్చుంటారు. దూరంగా రాజకీయాలను శాసిస్తూ ఉంటారు.

మహాత్మా గాంధీ ఓ మాట అన్నారు. మొదటవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు., తర్వాత మిమ్మల్ని చూసి నవ్వుతారు.పిమ్మట దాడిచేస్తారు.అటు పిమ్మట మీరు గెలుస్తారు. జనసేన ఇప్పుడు మూడవ దశలో ఉంది.ప్రయాణం విజయం తో ముగుస్తుంది.జనసేనపై అవినీతి రాజకీయనాయకులు ఎంతగా దాడిచేస్తే అంతగా ఆ పార్టీ ఎదుగుతుంది.విజయాలు సాధిస్తుంది.