జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ప్రొ.నాగేశ్వ‌ర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
247

పాద‌యాత్ర‌లు చేస్తేనే ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. అలా అయితే ఆ పాద‌యాత్ర ఏదో నేనే చేసి ముఖ్య‌మంత్రిని అవుతా క‌దా..! ఇంట‌ర్వ్యూలు ఇస్తూ స్టూడియోల్లో ఎందుకు కూర్చుకుంటాం అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో చేసిన పాద‌యాత్ర గురించి అడిగిన ప్రశ్న‌కు స‌మాధానం ఇచ్చారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగా ప్రొ.నాగేశ్వ‌ర్‌రావు జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను, చ‌రిత్ర‌ను చెప్పుకొచ్చారు. అయితే, పాద‌యాత్ర అనేది ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఏదో ఒక పార్టీ ముఖ్య నాయ‌కుడు ఒక ప్రాంతంలో పాద‌యాత్ర చేస్తున్నాడంటే ఆ ప్రాంతంలో పార్టీ ప‌టిష్ట‌త‌కు ఆ పాద‌యాత్ర ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

ఇదే సంద‌ర్భంలో దివంగ‌త మాజీ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్ గురించి చెప్పుకొచ్చారు. ఆయ‌న ప్ర‌ధాని కావాల‌న్న సంక‌ల్పంతో భార‌త‌దేశం వ్యాప్తంగా పాద‌యాత్ర చేశార‌ని, అయినా ఆయ‌న పాద‌యాత్ర కాలేక‌పోయార‌న్నారు. చివ‌ర్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ఆయ‌న ఓ 20 రోజుల‌పాటు ప్ర‌ధాని సీటుపై కూర్చుకుని, ఆ త‌రువాత దిగిపోయార‌న్నారు. అలాగే దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో చేసిన పాద‌యాత్రతో ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించార‌న్నారు.

పాద‌యాత్ర అనేది రోజూ టీవీ ఛానెళ్ల‌లో, ప‌త్రిక‌ల్లో క‌నిపిస్తూ పార్టీ గురించి, పార్టీ అధినేత గురించి మాట్లాడుకునేందుకు ఉపయోగ‌ప‌డ‌ట‌మే కాకుండా, పార్టీని స‌జీవంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంచేందుకు, త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌జ‌ల‌కు నేరుగా చూపేందుకు ఉప‌యోగప‌డుతుంద‌న్నా ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌రావు.