జ‌గ‌న్ తొలి మాట‌లు.. ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం..!

0
329

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం ఓడిపోతాన‌న్న భ‌యంతో ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను బెదిరించ‌డం, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవప‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డం, డ్రామాలు చేయ‌డం వంటి కుట్ర‌ల‌కు తెర‌తీశాడ‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. కాగా, గురువారం రాత్రి లోట‌స్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబుపై ఫైర‌య్యారు.

చంద్ర‌బాబు నాయుడు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా, కుట్ర‌ల‌కు తెరతీసినా ఓటింగ్ శాతాన్ని పెంచి స‌రికొత్త రికార్డును సృష్టించిన ప్ర‌జ‌ల‌కు, టీడీపీ శ్రేణులు అరాచ‌కాలు సృష్టిస్తున్నా ఆటుపోట్ల‌ను త‌ట్టుకున్న వైసీపీ శ్రేణుల‌కు జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న గొడ‌వ‌ల్లో భాగంగా మృతి చెందిన ఇద్ద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు జ‌గ‌న్ త‌న ప్ర‌గాడ‌సానుభూతి తెలిపారు.