ప్రాజెక్టుల నిర్మాణంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
233

రాజ‌ధాని ప్రాంతంలో భారీగా కుంభ‌కోణం జ‌రిగింద‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రాజ‌ధాని ఎక్క‌డ వ‌స్తుందో.. ముందే తెలుసుకున్న చంద్ర‌బాబు ఆయ‌న బినామీలు భూములను కొనుగోలు చేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారని ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో న‌చ్చిన రేటుకు భూముల‌ను లాక్కున్నార‌ని, అవ‌స‌ర‌మైతే విచార‌ణ జ‌రిపిస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

మీడియా స‌మావేశంలో భాగంగా పోల‌వ‌రం ప్రాజెక్టుపై స్పందించిన జ‌గ‌న్ టెండ‌ర్లలో అవినీతి జ‌రిగింద‌నిపిస్తే విచార‌ణ జ‌రిపిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. కొత్త‌గా రివ‌ర్స్ ట్రెండింగ్ తెస్తామ‌ని తెలిపారు. ఏ ప్రాజెక్టులోనైనా అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే, పాత టెండ‌ర్ల‌ను క్యాన్సిల్ చేసి కొత్త వాటిని పిలుస్తామ‌న్నారు.