జ‌గ‌న్ సీఎం అంటూ పోటా.. పోటీగా ఫ్లెక్సీలు..!

0
223

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇంకా వెలువడ‌క ముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే అస‌లు కౌంటింగ్ ప్రారంభంకాక‌ముందే ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వైసీపీ అధినేత‌, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల‌తో ఆ పార్టీ నేత‌లు హోరెత్తిస్తున్నారు.

అయితే, తాడేప‌ల్లిలోని వైఎస్ జ‌గ‌న్ నివాసం, వైసీపీ ప్ర‌ధాన కార్యాలయానికి అత్యంత స‌మీపంలో ఈ హోర్డింగ్‌లు ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. తాడేప‌ల్లిలోని న‌వోద‌య కాల‌నీలోని ఓ భ‌వ‌నంలో అద్దెకు ఉంటున్న వైసీపీ నేత ద‌వులూరి దొర‌బాబు తాను నివాసం ఉంటున్న భ‌వ‌నంపై ఈ హోర్డింగ్‌ను ఉంచారు. కాగా, ద‌వులూరి దొర‌బాబు పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన కో ఆర్డినేట‌ర్. ఆయ‌న వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నార‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.