జ‌గన్ – మోడీ భేటీకి డేట్ ఫిక్స్‌..!

0
224

వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుపొంద‌డంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో జ‌గన్ భేటీ అయ్యారు. వైసీపీ ఎల్పీ నేత‌గా త‌న‌ను ఎన్నుకున్న ప్ర‌తిని గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేయ‌డంతోపాటు ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని జ‌గ‌న్ కోరారు. ప్ర‌స్తుతం వీరి భేటీ ఇంకా కొన‌సాగుతోంది.

గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ ముగిసిన త‌రువాత జ‌గ‌న్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌నున్నారు. ఈ మేర‌కు పోలీసు ఉన్న‌తాధికారులు కేసీఆర్ అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. సీఎంగా త‌న ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రు కావాల్సిందిగా కేసీఆర్‌ను జ‌గ‌న్ కోర‌నున్నారు. అలాగే రేపు మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని మోడీతో వైఎస్ జ‌గ‌న్ మ‌ర్యాదపూర్వ‌క భేటీ జ‌ర‌గనుంది.