వైఎస్ జ‌గ‌న్ తాజా షెడ్యూల్ అవుట్‌..!

0
218

ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అంత‌కు ముందు పాల్గొన‌నున్న కార్య‌క్ర‌మాల‌పై షెడ్యూల్ విడుద‌లైంది. ఆ షెడ్యూల్ ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి ముందు దివంగ‌త నేత, తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆశీస్సులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన వైఎస్ జ‌గ‌న్ ఈ రోజు రాత్రి ఇడుపులపాయ‌కు వెళ్ల‌నున్నారు.

అయితే, ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న జ‌గ‌న్ కాసేప‌టి క్రిత‌మే అక్క‌డి నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌ల్దేరారు. విజ‌య‌వాడ‌కు చేరుకున్న అనంత‌రం అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో క‌డ‌ప చేరుకోనున్నారు. రేపు ఉద‌యం ఇడుపుల‌పాయ‌లో తండ్రికి నివాళులు అర్పిస్తారు.

అనంత‌రం గుడికి వెళ్లి గండి ఆంజనేయస్వామిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డి నుంచి పులివెందుల చేరుకుని సీఎస్ఐ చ‌ర్చిలో ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత క‌డ‌ప‌లోని పెద్ద ద‌ర్గాను సంద‌ర్శించిన అనంత‌రం తిరిగి విజ‌య‌వాడ చేరుకుంటారు.