ప్ర‌శాంత్ కిశోర్ వ‌ల్లే వైసీపీ గెల‌వ‌బోతుందా..? జ‌గ‌న్‌కు అంత స‌త్తా లేదా..?

0
196

ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహ ర‌చ‌న వ‌ల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌బోతుంద‌ని, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాబోతున్నారంటూ ఇటీవ‌ల కాలంలో కొన్నిక‌థ‌నాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ వ్య‌వ‌హారాల్లో, జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ‌లో అంతా ప్ర‌శాంత్ కిశోర్ ఇన్వాల్వ్‌మెంట్‌తోనే జ‌రుగుతుందా..? ప్ర‌శాంత్ కిశోర్ లేకుంటే వైసీపీ గెల‌వ‌లేదా..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అయితే, ఈ ప్ర‌శ్న‌లన్నిటికీ రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి శైలిలో స‌మాధానాలు ఇస్తున్నాయి. అదే స‌మ‌యంలో బీహార్ రాజ‌కీయాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌శాంత్ కిశోర్ వంద‌కు వంద శాతం రాజ‌కీయ వ్యూహాల‌ను ర‌చించ‌గ‌లిగితే బీహార్‌లో నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌డ‌ని, జేడీయూ పార్టీకి ప్ర‌శాంత్ కిశోర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎందుకు ఎంటాడంటూ ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

ప్ర‌శాంత్ కిశోరే బీహార్‌లో పార్టీపెట్టి బ్ర‌హ్మాండంగా వ్యూహాలు ర‌చించి ముఖ్య‌మంత్రి అయిపోతాడు క‌దా..! అలా జ‌ర‌గ‌లేదంటే ప్ర‌శాంత్ కిశోర్‌కు అంత సీన్ లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు స‌మాధాన‌మిస్తున్నాడు. ప్ర‌శాంత్ కిశోర్ వ‌ల్లే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అమాంతం పెరిగింద‌ని చెప్ప‌డం అవివేక‌మ‌ని వారు పేర్కొంటున్నారు.

ప్ర‌శాంత్ కిశోర్ రాజ‌కీయ నాయ‌కుల బ్రాండింగ్‌ను, ప్ర‌మోట్ చేయ‌డంతోపాటు త‌న బ్రాండింగ్‌ను కూడా చాలా ఎఫెక్టివ్‌గా ప్ర‌మోట్ చేయ‌గ‌లుగుతాడ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కు మాట‌. ఆ క్ర‌మంలోనే 2014లో మోడీని ప్ర‌శాంత్ కిశోరే గెలిపించాడ‌ని, నితీష్ కుమార్‌ను ప్ర‌శాంత్ కిశోరే గెలిపించాడ‌ని చెబుతుంటారు. మ‌రి అదే ఎన్నిక‌ల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌ను కూడా ప్ర‌శాంత్ కిశోరే ఓడించాడా..? అన్న ప్ర‌శ్న కూడా తెర‌మీద‌కు వ‌స్తుంది. అందువ‌ల్ల ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌లు వినియోగించుకున్నంత మాత్ర‌న గెలుస్తారు.. రేపటి రోజున వైఎస్ జ‌గ‌న్ గెలిచినా అది ప్ర‌శాంత్ కిశోర్ వ‌ల్ల‌నే అనుకుంటే అది అవివేక‌మే అవుతుంద‌ని రాజ‌కీయ వాశ్లేష‌కుల వాస్త‌వ వాద‌న‌.