జ‌గ‌న్ సీఎం అయితే.. కేబినేట్ మంత్రులు వీళ్లే..!

0
280

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల‌కు 30 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉన్నా ప్ర‌భుత్వ ఏర్పాటుపై అప్పుడే జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మంటూ అంచ‌నాలు ఊపందుకున్నాయి. వైసీపీ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా, ఆ పార్టీలో నేతల్లో ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వులు ద‌క్కుతాయో అన్న డిస్క‌ర్ష‌న్ కూడా సీరియ‌స్‌గా జ‌రుగుతోంది.

ఈ సారి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌ల గ‌ట్టిగానే న‌మ్ముతున్నారు. మే 24న ప్ర‌మాణ స్వీకారం చేసేది జ‌గ‌నేన‌ని చెబుతున్నారు. ఈ క్రమంలో జ‌గ‌న్ కేబినేట్‌లో ఉండే మంత్రుల పేర్లు ఇవేనంటూ ఫేస్‌బుక్, ట్వీట్ట‌ర్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ల‌లో క‌థ‌నాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
ఆ క‌థ‌నాల ప్ర‌కారం..

స్పీక‌ర్ : ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు
రెవెన్యూశాఖ : ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
హోంమంత్రి : పెద్దిరెడ్డి
సినిమాటోగ్రఫీ శాఖ : ఆర్‌కే రోజా
ఇరిగేష‌న్ శాఖ : కొడాలి నాని
మైనార్టీ మంత్రులుగా క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల నుంచి ఒక‌రు. ఆర్థిక మంత్రిగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, ఐటీ మంత్రిగా గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి పేర్లను పేర్కొంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.