అందుకు ఒప్పుకోలేద‌ని – జ‌బ‌ర్ద‌స్త్‌ వినోద్‌పై ఇంటి ఓన‌ర్ దాడి..!

0
3717

ప్ర‌ముఖ బుల్లితెర ఛానెల్‌ల్లో ప్ర‌తి వారం ప్ర‌సార‌మయ్యే బ‌జ‌ర్ద‌స్త్ షోలో లేడీ గెట‌ప్‌లు వేస్తూ హాస్యాన్ని పండించే న‌టుడు వినోద్‌పై దాడి జ‌రిగింది. అయితే ఈ దాడి స్వ‌యాన వినోద్ అద్దెకు ఉంటున్న ఇంటి ఓన‌ర్ చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటూ కొన‌సాగే జ‌బ‌ర్ద‌స్త్ చమ్మ‌క్ చంద్ర టీమ్‌లో వినోద్ లేడీ క్యారెక్ట‌ర్ వేస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని షోల‌లో చ‌మ్మ‌క్ చంద్ర టీమ్‌లో కానీ, మ‌రే ఇత‌ర స్కిట్‌ల‌లో వినోద్ క‌న‌ప‌డ‌టం లేదు.

ఇందుకు సంబంధించి కొత్త వారిని ప్రోత్స‌హించేందుకు జ‌బ‌ర్ద‌స్త్ టీమ్‌ వినోద్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని, కాదు కాదు.. వినోద్ ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడ‌గ‌టం కార‌ణంగా జబ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు తొల‌గించారంటూ కొన్ని క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇలా క‌థ‌నాలు వెల్లువ‌లా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క్ర‌మంలో వినోద్‌పై దాడి జ‌రిగిందని, అందుకు సంబంధించిన ఫోటోలు ఇవిగో అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాకుండా, త‌న‌పై దాడి చేసింది త‌న ఇంటి ఓన‌రేనంటూ వినోద్ కాచిగూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడ‌ని, ఆ మేర‌కు పోలీసులు కూడా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించ‌ని కార‌ణంగా ఈ దాడి జ‌రిగిందా..? లేక మ‌రే కోణ‌మైనా ఉందా..? అన్న చ‌ర్చ కూడా సాగుతుంది.