ఉద‌య శ్రీ : జ‌బ‌ర్ద‌స్త్ బూతు షోనా..?

0
265

ఒక‌రిని కించ‌ప‌రిస్తేనే ఎక్కువ కామెడీ వ‌స్తుంది.. ఒక‌రిని కించ‌ప‌ర‌చ‌కుండా కామెడీచేస్తే అందులో న‌వ్వు రాదని యాంక‌ర్ ఉద‌య శ్రీ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది. అలా అని కామెడీ కోసం ఇష్ట‌మొచ్చిన రీతిలో ఏదైనా చేయొచ్చు అన్న‌ది త‌న మాట‌కు అర్ధం కాద‌ని కూడా చెప్పుకొచ్చింది. ఒక క‌మెడియ‌న్ చెప్పిన జోక్‌కు న‌వ్వ‌డ‌మూ.. న‌వ్వ‌క‌పోవ‌డ‌మూ అన్న‌ది ఆడియ‌న్స్‌ని బ‌ట్టి ఉంటుంద‌ని తెలిపింది.

ఇంట‌ర్వ్యూలో భాగంగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో బూత్ షో అంటూ డిబేట్స్ న‌డుస్తున్న నేప‌థ్యంలో మీ అభిప్రాయం ఏంటి..? అని ప్ర‌శ్నించ‌గా, అంద‌రూ అనుకున్న‌ట్టు తాను జ‌బ‌ర్దస్త్ బూతు షో అని తాను అనుకోవ‌డం లేదంటూ ఉద‌య శ్రీ స‌మాధాన‌మిచ్చింది. అందుకు ఉదాహ‌ర‌ణ చెబుతూ తాను అంద‌రిలో కొంద‌రికి న‌చ్చొచ్చు.. మ‌రికొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు.. అలానే జ‌బ‌ర్ద‌స్త్ కూడా అంద‌రికి న‌చ్చాల‌న్న రూల్ లేదు క‌దా..? అంటూ ఎదురు ప్ర‌శ్నించింది.